వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత వారం సూచీలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఈ వారం మాత్రం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 375 పాయింట్లు లాభపడి 81, 559 దగ్గర ముగియగా.. నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 24, 936 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.83.94 దగ్గర ముగిసింది.
గురువారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాలు ప్రకటించింది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్పంగా లాభాల్లోకి వెళ్లినట్లే వెళ్లి నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. శుక్రవారం మాత్రం అందుకు భిన్నంగా కొనుగోళ్లు కనిపించాయి.