బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ సినిమాలకు ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుంది. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘మేడే’. ఈ మూవీలో అజయ్ దేవగణ్ సరసన టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తోంది. అయితే ‘మేడే’ మూవీ టైటిల్ ఇప్పుడు మారిపోయింది. తమ సినిమా పేరును ‘రన్‌వే 34’గా మారుస్తున్నట్లు హీరో అజయ్‌దేవగణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. టైటిల్ మార్పుకు కారణాలను అతడు చెప్పలేదు. ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతోంది.…