దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు అమాంతంగా పెరిగిపోయాయి. పదుల్లో ఉండే కేసులు ఇప్పుడు వేలల్లోకి వచ్చేశాయి. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో RT-PCR పరీక్షలు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష టెస్టులు చేయాలని సూచించింది. RT-PCR, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు…
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం టీటీడీ కీలకమైన ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని స్పష్టం చేసింది. ఒకవేళ వ్యాక్సిన్ ఇంకా వేయించుకోని నేపథ్యంలో 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలిపింది. ఈ విషయాన్ని గతంలోనే తాము ప్రకటించినా కొంత మంది భక్తులు పట్టించుకోకుండా తిరుమల కొండపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీటీడీ అసహనం వ్యక్తం చేసింది. Read Also: సంక్రాంతి సందర్భంగా…
తమిళనాడులో ప్రస్తుతం కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ రాష్ట్రంలో అన్ని రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే, తమిళనాడు సరిహద్దు కలిగిన కేరళ రాష్ట్రంలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రతిరోజు ఆ రాష్ట్రంలో 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఐదు రోజుల కాలంలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ నుంచి వచ్చే ప్రయాణికులపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Read: జగన్…