తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మళ్లీ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ.. దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు.. ఇక, నల్గొండ ఆర్టీసీ డిపోల్లో ఆకస్మిక తనిఖీలు చేవారు సజ్జనార్.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని.. రైతులకు కూడా ఉపయోగపడేలా కార్గో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు.. రెండేళ్లుగా 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో…