రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రవాణా శాఖ సాధించిన విజయాలపై ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్లో జరుగుతున్న సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను గుర్తు చేయాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.