Cognizant: టెక్ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తన ప్రధాన కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టింది. చెన్నైలోని ఒక్కియం తొరాయ్‌పక్కంలోని ఈ బిల్డింగ్ ను దాదాపు 20 ఏళ్లుగా ఆ సంస్థ హెడ్ ఆఫీస్‌గా ఉపయోగిస్తుంది. ఐటీ కారిడార్‌లోని దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు లక్షల చదరపు అడుగుల ఈ కార్యాలయం విలువ కనీసం 750 - 800 కోట్ల రూపాయల మధ్య ఉంటుందని రియల్ ఎస్టేట్ సంస్థల అంచనా వేస్తున్నాయి.