RRR సినిమా విడుదలకు సర్వం సిద్ధంగా ఉంది. దర్శక దిగ్గజం రాజమౌళితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో RRR ప్రమోషన్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరుగుతున్న ఇంటర్వ్యూలలో ‘ఆర్ఆర్ఆర్’ టీం సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో డైలాగ్ పోర్షన్ చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. దానికి తోడు…