ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఇప్పటికే ఐపీఎల్ పాలక వర్గం అనుమతించింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఉంటుంది. రిటైన్ జాబితాను ప్రకటించడానికి అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నా.. ఇప్పటివరకు ఏ జట్టు కూడా అధికారికంగా జాబితాను విడుదల చేయలేదు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆరుగురిని రిటైన్ చేసుకుందని…