ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్ లోటాస్ గెలిచిన బెంగళూరు.. మొదటగా బౌలింగ్ తీసుకుంది. ఈ క్రమంలో లక్నో బ్యాటింగ్ కు దిగనుంది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ జట్టులో అల్జరీ జోసెఫ్ స్థానంలో టాప్లీ ఆడుతున్నారు
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోర పరాజయం పాలైంది. 7 వికెట్ల తేడాతో కోల్ కతా గెలుపొందింది. 183 పరుగుల లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు హోంగ్రౌండ్ లో ఆడిన ఏ జట్టూ ఓడిపోలేదు. కానీ.. ఈరోజు కేకేఆర్ తో చేతిలో ఓటమి చెందింది.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు ఆర్సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కోల్ కతా ముందు ఓ ఫైటింగ్ స్కోరును నమోదు చేశారు. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో కూడా రాణించాడు. 59 బంతుల్లో 83 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 4…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు కోల్కతా నైట్రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కోల్కతా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. కేకేఆర్ ఒక్క మ్యాచ్ ఆడి గెలువగా.. ఆర్సీబీ రెండు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో గెలిచింది.
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి . సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో స్వదేశంలో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్, మొదటి గేమ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఓడిపోయినా ఆర్సీబీ తన రెండో గేమ్ లో పంజాబ్ కింగ్స్ పై ఈ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేయడంతో.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో పైకి రావడానికి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ప్రారంభ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెన్లరుగా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (21) ఫాఫ్ డుప్లెసిస్ (35) పరుగులు చేశారు. ఆ తరవాత బ్యాటింగ్ కు దిగిన రజతన్ పాటిదర్, గ్లేన్ మ్యాక్స్ వెల్…