తెలుగు చిత్రసీమలో నటసింహ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. వీరి కాంబోలో తెరకెక్కిన ఐదు చిత్రాలలో నాలుగు వరుసగా సూపర్ హిట్స్ గా నిలిచాయి. బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ చిత్రం ‘రౌడీ ఇన్ స్పెక్టర్’. ఈ సినిమా 1992 మే 7న విడుదలై విజయఢంకా మోగించింది. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణతో బి.గోపాల్ రూపొందించిన ‘లారీ డ్రైవర్’ సైతం సూపర్ హిట్ గా నిలచింది.…