ఈ ఏడాది చివరలో ఐపీఎల్ 2025కు సంబందించిన మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. మెగా వేలం నేపథ్యంలో అందరి చూపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఉంది. ఇందుకు కారణం ముంబై ఇండియన్స్‌కు ఐదుసార్లు ట్రోఫీలు అందించిన రోహిత్.. ఆ జట్టులోనే కొనగాగుతాడా? లేదా? అని. గత కొంత కాలంగా హిట్‌మ్యాన్ ఐపీఎల్ భవితవ్యంపై చర్చ కొనసాగుతోంది. ముంబైలో ఉండడం రోహిత్‌కు ఇష్టం లేదని, వేరే జట్టుకు వెళ్లిపోతాడు అని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.…