అగ్ర రాజ్యం అమెరికా హెచ్చరించినట్లుగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేయడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు.