కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నాము అంటూ వారి నుంచి వచ్చిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మళ్ళీ వీరిద్దరూ కలిసి ఉండబోతున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ, వాటి గురించి ఇంకా స్పష్టత లేదు. ఇదిలా ఉండగా మొదటిసారిగా ధనుష్ తన పిల్లలతో కలిసి పబ్లిక్ గా కన్పించారు. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…