Sai Dharam Tej:నేటి యువతతో పాటు అందరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్‌నెస్‌తో వుండాలని సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజరాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు.