RJD chief's controversial comments: బీహార్ రాష్ట్రీయ జనతాదళ్( ఆర్జేడీ) చీఫ్ జగదానంద్ సింగ్ శనివారం మరో వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఆర్ఎస్ఎస్, హిందూ సమాజాన్ని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సైద్ధాంతిక విభాగం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), తీవ్రవాద గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా( పీఎఫ్ఐ) రెండూ కూడా ఒకటే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు గ్రూపులు కూడా వారి మతస్తులకు సేవ చేయాలని అనుకుంటున్నాయని సమర్థించాడు