లక్నోతో జరిగిన మ్యాచ్‌లో భాగంగా స్టోయినిస్ క్యాచ్ పట్టిన తర్వాత రాజస్థాన్ యువ ఆటగాడు రియాన్ పరాగ్ వ్యవహరించిన తీరుపై మ్యాథ్యూ హేడెన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడు సంయమనంతో వ్యవహరించాలని సూచించిన హేడెన్.. అతడు సంబరాలు చేసుకున్న విధానం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. అసలేం జరిగిందంటే.. 19వ ఓవర్‌లో మెక్‌కాయ్ బౌలింగ్‌లో మార్కస్ స్టోయినిస్ భారీ షాట్ కొట్టగా.. రియాన్ క్యాచ్ అందుకున్నాడు. రీప్లేలో బంతి నేలను తాకినట్టు కనిపించడంతో అది నాటౌట్‌గా తేలింది. ఇన్నింగ్స్…