Prakasam Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
Kaleshwaram : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది మరోసారి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నదికి వచ్చే వరద నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో పుష్కర ఘాట్ల వద్ద అలముకున్న తాత్కాలిక వ్యాపార స్థలాలు పూర్తిగా నీట మునిగాయి. ఇప్పటి వరకు నీటి కొరతతో వెలిసిన నదీ తీరంలో గుడారాలు వేసుకుని వ్యాపార కార్యకలాపాలు సాగించిన స్థానికులు, వరద ఉధృతికి అవన్నీ కోల్పోయారు. మరోవైపు, నీటి ఉధృతి…