చలి తీవ్రత నానాటికి పెరుగుతోంది. ఈ సీజన్ వస్తే చాలు అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి. మరోవైపు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి కారణాలతో మరణించే వారి సంఖ్య కూడా చలికాలంలోనే ఎక్కువగా ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే.. ఇతర సీజన్లతో పోలిస్తే శీతాకాలంలో గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. ఈ సీజన్‌లో గుండెపోటు పెరగడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం..