బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు. ప్రసిద్ధ హిందూ పండుగ జన్మాష్టమిని జరుపుకోవడానికి తాను తన భార్యతో కలిసి ఆలయాన్ని సందర్శించినట్లు ఓ చిత్రాన్ని రిషి సునాక్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.