కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తాజాగా కన్నుమూశారు. కన్నడ ఇండస్ట్రీలో దేవుడిగా కొలిచే రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ ఇక లేడన్న విషయం ఆయన అభిమానులను శోకంలో ముంచేసింది. జిమ్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని భావించి ఆ తరువాత బెంగుళూరులోని విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. 46 ఏళ్ల వయసులోనే ఆయనను…
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు. ఆయన శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. పునీత్ వయసు 46. ఆయన ఇంత చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడి కన్నుమూయడం సెలబ్రిటీలతో పాటు ఆయన అభిమానులను కూడా…