ముఖ్యమంత్రి జగన్ స్వంత జిల్లా లోని కడప రిమ్స్ లో పసికందుల మరణాలు కలవరపరుస్తున్నాయని, కడప రిమ్స్ ఘటనలో ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పసిబిడ్డల తల్లితండ్రులను పోలీసులతో ఎందుకు తరలించారు? కడప నగరంలోని రిమ్స్ వైద్యాలయంలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు విడిచిన ఘటన మాటలకు అందని విషాదం. విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం లాంటి కారణాలతోనే పసి బిడ్డలు కన్నుమూశారు. ఒక మానిటర్ తోనే 30మంది…