సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో చుక్కెదురైంది.. రాంగోపాల్ వర్మ తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చే శారు.. ఇక, ఆర్జీవీ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.. అరెస్ట్‌పై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది..