తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 గంటలుగా కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. క్యాబినెట్ లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీలో కొత్త జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కడప, కోనసీమ జిల్లాల్లో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం, అమలాపురం డివిజన్లలోని 7 మండలాలను కొత్తపేట రెవెన్యూ డివిజన్ గా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. కొత్తపేట రెవెన్యూ డివిజనులో ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలను చేరుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది రెవెన్యూ శాఖ. కడప జిల్లాలో కొత్త…
ఆంధ్రప్రదేశ్ స్వరూపం మారింది. పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన పూర్తయింది. ఇప్పుడున్న 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. అలాగే 21 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. దీంతో డివిజన్ల సంఖ్య 51 నుంచి 72కు చేరింది. ఈ మేరకు శనివారం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. 17,500కు పైగా సూచనల పరిశీలన అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తిచేసింది. జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. కొన్ని జిల్లాల్లో…