Allu Arjun: సంధ్య తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పీఎస్‌లో హీరో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. విచారణ ముగిసిన అనంతరం ఎవరితో మాట్లాడకుండానే అల్లు అర్జున్ కారులో వెళ్లిపోయారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన…
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం విచారణకు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్టేషన్ కు వెళ్లారు.
మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఇది చాలా దురదృష్టకరమైన యాక్సిడెంట్. నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఇది ఒక యాక్సిడెంట్, ఇందులో ఎవరు తప్పులేదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి సెక్షన్ నుంచి ఉన్న అందరూ ఇక్కడికి వచ్చింది ఒక మంచి ఆలోచనతోనే. సినిమా అందరం కలిసి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తో చేసినా సరే ఇది యాక్సిడెంట్. ఇది పూర్తిగా యాక్సిడెంట్…