తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు సంచలనం సృష్టిచింది. అయితే, నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోడీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందని రేవంత్ రెడ్డి చెప్పారు.
సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని లేఖలో ప్రస్తావించారు. బీసీ కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని.. బీసీ జనగణన డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని తెలిపారు. ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతి నిరసన, ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
Revanth Reddy: తెలంగాణ ను అవమానించిన మోడీతో మహబూబ్ నగర్ లో సభ పెట్టడం తప్పని కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ తెలంగాణను వ్యతిరేకించారు కాబట్టి రాజగోపాల్, వివేక్, విజయశాంతి హాజరు కాలేదని ప్రజలు అనుకుంటున్నారని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు.
Revanth Reddy: బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వేవ్ ను ఆపడం ఎవరి తరం కాదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని రాహుల్ గాంధీకి, మల్లికార్గున ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడంపై ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డాడు.
Mynampalli: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి, ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లారు.
Mallareddy: కాంగ్రెస్ వాళ్లకు మల్లన్న సినిమా చూపిస్తా అని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలో మర్రి రాజశేఖర్ రెడ్డి భారీ ప్రదర్శన ఏర్పాట్లు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో నేడు ( శుక్రవారం ) జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్ధుల ఎంపికపై నిన్న , ఇవాళ సుదీర్ఘంగా ఈ కమిటీ చర్చించింది. అభ్యర్ధుల జాబితాపై కసరత్తు పూర్తైనట్లు టాక్.