Etela Rajender: ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. లగిచెర్ల అరెస్టుల ఘటనపై ఢిల్లీ నుండి ఈటల రాజేందర్ స్పందించారు. లగిచెర్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నాము. వారి మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందన్నారు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు.…