మతపరమైన ప్రార్థనల కోసం నివాస గృహాన్ని ఉపయోగించడంపై ఎలాంటి ఆంక్షలు లేవని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. బెంగళూరులోని హెచ్‌బీఆర్ లేఅవుట్ నివాసి నివాసాన్ని ప్రార్థనకు ఉపయోగిస్తున్నారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పీఐఎల్) కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.