రైతుల నిరసనల సందర్భంగా ప్రధాన వార్తల్లో నిలిచిన పంజాబీ నటుడు దీప్ సిద్ధూ మంగళవారం యాక్సిడెంట్ కారణంగా కన్నుమూశారు. ఢిల్లీ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఆయన నడుపుతున్న తెల్లటి స్కార్పియో వాహనం, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే అని కూడా పిలువబడే వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై హర్యానాలోని ఖర్ఖోడా సమీపంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో దీప్ సిద్ధూ నటి, స్నేహితురాలు రీనా రాయ్‌తో కలిసి…