UP: ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడి బీజేపీ ప్రభుత్వం మాఫియా, ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, నేరస్తులకు వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే, పలువురు గ్యాంగ్‌స్టర్లు పోలీస్ ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. నేరాలు చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకువచ్చారు యోగి. అయితే, ఇప్పుడు యోగి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది. కుక్కలు కూడా ప్రజలకు ఇబ్బందులు కలిగిసే కటకటాల్లో పెడతామంటూ కొత్త నిబంధనల్ని ప్రకటించింది.