బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అనగాని నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. రేపల్లెలోని పోటుమెరక గ్రామంలో మద్యం సేవించి మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తామని శనివారం నాడు టీడీపీ ప్రకటించింది. మద్యం మరణాలపై టీడీపీ వేసిన నిజనిర్ధారణ కమిటీ బాధిత కటుంబాలను కలిసేందుకు సిద్ధమైంది. అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీల పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ…