ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఒకేసారి 998 అద్దె బస్సులకు టెండర్లు పిలవడం పెను దుమారంగా మారింది. APSRTC ని ప్రైవేట్ వైపు తీసుకెళ్ళే ఆలోచనలో భాగంగానే అద్దె బస్సుల సంఖ్యని పెంచే ప్రయత్నంలో ఉన్నారని అనుమానాలు రేకెత్తాయి. అయితే, తాజాగా వీటిని APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు కొట్టిపారేశారు. అద్దె బస్సుల పెంపు వల్ల కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయే తప్ప, ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుందన్నది అవాస్తవమని స్పష్టం చేశారు.…