APSRTC Strike: ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు సమ్మె సైరన్ మోగించాయి. ఏపీఎస్ఆర్టీసీకి నాలుగు రోజుల సమయం ఇస్తూ సమ్మెకు సిద్ధమౌతున్నట్టు ప్రకటించాయి. తమకు స్త్రీ శక్తి వల్ల ఏర్పడిన భారాలను తగ్గించుకోవడానికి అద్దె రూ. 20వేలు పెంచాలని కోరినా కేవలం రూ. 5 వేలే పెంచారని ఆందోళనకు దిగారు.