Gyanvapi mosque: భారత పురావస్తు సర్వే (ASI) మాజీ ప్రాంతీయ డైరెక్టర్ కెకె ముహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో గత కొంత కాలంగా కొనసాగుతున్న మందిర్ - మసీద్ వివాదంపై స్పందించారు. ఈ వివాదంపై సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. రామ జన్మభూమి, మధుర, జ్ఞానవాపి మూడు స్థలాలు మాత్రమే చర్చకు కేంద్రంగా ఉండాలని కోరారు. హిందువులు మరిన్ని డిమాండ్లు చేయకుండా ఉండాలంటే ముస్లింలు ఈ ప్రాంతాలను ఇష్టపూర్వకంగా అప్పగించాలని సూచించారు.
మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి- షాహి ఈద్గా వివాదం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయం హిందూ పక్షానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.