Srinivas Goud : తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్షలు మంచివి కావని, తెలంగాణ ఆలయాల్లో అందరినీ సమానంగా చూసే విధానాన్ని గుర్తుచేశారు. తిరుమలలో కూడా ఇదే నిబద్ధత ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం గద్వాల నియోజకవర్గంలోని జములమ్మ అమ్మవారిని శ్రీనివాస్ గౌడ్ కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం గద్వాల బీఆర్‌ఎస్ నాయకుడు బాసు హనుమంత నాయుడు…