రియల్‌మీ 16 ప్రో సిరీస్ భారతదేశంలో అతి త్వరలో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. లాంచ్ తేదీని త్వరలో ప్రకటిస్తామని రియల్‌మీ పేర్కొంది. ఈ సిరీస్‌లో రియల్‌మీ 16 ప్రో, రియల్‌మీ 16 ప్రో+ మోడల్‌లు ఉండనున్నాయి. రియల్‌మీ విడుదల చేసిన టీజర్ ఇమేజ్‌లో స్లిమ్ డిజైన్ ఉన్న ఫోన్ కనిపిస్తుంది. ఇందులో గోల్డెన్-టోన్ మిడిల్ ఫ్రేమ్, వెనుక కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. ఇది రియల్‌మీ 16 ప్రో సిరీస్‌లోని మోడల్ అని టిప్‌స్టర్స్ అంటున్నారు.…