Harish Rao: బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో.. ఇప్పుడు ప్లాట్లు అమ్ముడు పోలేదని బిల్డర్ ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు.. ఇప్పుడు బిల్డర్లు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.