అయాచితంగా ఓనేతపై చేసిన విమర్శలకు కొంత కాలంగా ఆయన ఫలితం అనుభవిస్తున్నాడు. అత్యంత సౌమ్యుడు… వివాదరహితుడుగా పేరుపొందిన ఆ విద్యావేత్తను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. వదల బొమ్మాలి అన్న రీతి లో సదరు నేత వెంటపడుతుండడం ఇబ్బందికరంగా మారింది. భూ వివాదాలు… రాజకీయంగానే కాకుండా వ్యాపార లావాదేవీల అంతు తేలుస్తా అంటూ బహిరంగ ప్రకటనలు చేయడం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా టీడీపీలో జేసీ ప్రభాకర్ రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి మధ్య ముదిరిన వివాదం…