అమ్మబోతే అడవి… కొనబోతే కొరివి అన్నట్టుగా తయారైంది కొబ్బరి రైతుల దుస్థితి. కన్నకొడుకు ఆదుకున్న లేకపోయినా కొబ్బరి చెట్టు ఆదుకొంటుందని కోనసీమ వాసుల నమ్మకం. కొబ్బరి చెట్టును కల్పతరువుగా పూజిస్తారు కోనసీమ వాసులు . కొబ్బరి ఉత్పత్తుల పేరు చెబితే గుర్తొచ్చేది కేరళ తరువాత కోనసీమ కొబ్బరి మాత్రమే. గత కొన్ని ఏళ్లుగా కోనసీమ కొబ్బరి రైతులు దిగుబడి లేక నల్లి తెగుళ్ల వల్ల ఉత్పత్తి తగ్గిపోయి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పుల వలన…
కొత్త జిల్లా ప్రకటనతో ఏపీలోని కొన్ని ప్రాంతాలలో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చుట్టుపక్కల భూముల ధరలు రెట్టింపయ్యాయి.దీంతో పొలాలన్నీ వెంచర్లుగా మారిపోతున్నాయి. గుంటూరు జిల్లాలోని కొత్తగా రాబోతున్న పల్నాడు జిల్లాలో రియల్ బూమ్ ఊపందుకుంది. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు ప్రకటనతో పల్నాడు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా కేంద్రానికి రావాలంటే 125 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి రావడం ఇబ్బందిగా మారింది. కొత్తగా జిల్లా ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.…
గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ అధినేత శ్రీధర్ రావుపై ఉచ్చుబిగుస్తోందా? ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు సంధ్య శ్రీధరరావు బాధితులు. ఇప్పటివరకు పలు పోలీస్ స్టేషన్లో 16 పైగా కేసు నమోదయ్యాయి.నార్సింగి,రాయదుర్గం, గచ్చిబౌలి ,బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ,మియాపూర్ లో శ్రీధరరావు పై కేసులు నమోదయ్యాయి. తాజాగా రాయదుర్గం భవన వ్యవహారం సంబంధించి చైతన్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలో చైతన్య రెండు ప్లాట్లు కొనుగోలు చేశారు. పూర్తి డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు చైతన్య. రాయదుర్గం ఏరియా లో…