చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోషియేషన్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ పేరుతో వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
తొక్కిసలాట ఘటనపై బెంగుళూరు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తొక్కిసలాట గాయపడిన బాధితుడు ఫిర్యాదు మేరకు నమోదు చేశారు. ఆర్సీబీ ఎక్స్ చేసిన పోస్టు చూసి తాను ర్యాలీ కి వచ్చి గాయపడ్డానని ఆర్సీబీ ఫ్యాన్ అయిన బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి తప్పులకు తాను ఇబ్బందులు పడాల్సి వచ్చిందని.. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు…
ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులో సంభవించిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ఈ ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తొక్కిసలాట ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిందితులుగా చేర్చారు. మరోవైపు మెజిస్టేరియల్ విచారణలో భాగంగా ఇప్పటికే వారికి అధికారులు నోటీసులను జారీ చేశారు.
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పు నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల వేళ పెనువిషాదం చోటుచేసుకుంది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో సహా పలువురు ఇప్పటికే ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ యాజమాన్యం సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అంతే కాకుండా.. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం…