విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఓవర్‌హెడ్ కేబుల్ తెగిపోవడంతో విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంటకాపల్లి వద్ద నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో దాని వెనుకే అత్యంత వేగంగా వచ్చిన విశాఖ-పలాస ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయగడ ప్యాసింజర్‌కు చెందిన నాలుగు భోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.