తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్‌లోని ప్రభుత్వ భూములను అమ్మేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అయింది. రాయదుర్గ్‌లోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 18.67 ఎకరాలను సర్కార్ వేలం వేయనుంది. ఎకరా రూ.101 కోట్లకు విక్రయించనున్నట్లు తెలంగాణ స్టేట్ ఇండస్టీస్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ప్రకటించింది. ఇదే ధరకు అమ్ముడుపోతే.. దాదాపుగా రూ.1900 కోట్లు ప్రభుత్వంకు రానున్నాయి. ఒకవేళ వేలంలో పోటీ ఉంటే.. మరింత ఎక్కువ సొమ్ము సర్కార్ ఖాతాలో…