నటసింహం నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’ మెల్లమెల్లగా జనాల్లో వేడెక్కిస్తోంది. ఈ టాక్ షో ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సాగడం వల్ల కాబోలు, జనాల్లో విపరీతమైన చర్చ సాగడం లేదు. అదే ఏదైనా టీవీ ఛానెల్ గనుక నిర్వహించి ఉంటే, సామిరంగా తీరేవేరుగా ఉండేదని చూసిన వారు చెబుతున్నారు. ఇప్పటికే ప్రతి ఎపిసోడ్ వైవిధ్యంగా సాగుతోంది. దీని గురించి తెలుసుకున్నవారు అదే పనిగా ‘ఆహా’ ఓటీటీ సబ్ స్క్రైబర్స్ గా…