AV Ranganath : రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జాపై హైడ్రా సర్వే చేస్తున్న స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారని ఆరోపణతో నిన్నటి నుండి హైడ్రా అధికారులు సర్వే చేస్తున్నారు. మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డిపై ఏవీ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కమిషనర్‌పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. చెరువు…
గత కొన్ని నెలలుగా శ్రీలంకలో ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాపారవేత్త శ్రీలంక ప్రజలకు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డిని ఇటీవల శ్రీలంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ (సీఐడీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక ప్రజలకు ఆయన రూ.5 లక్షలు పంచుతుండగా సీఐడీ అధికారులు ప్రశ్నించి వదిలేసినట్లు రవీందర్‌రెడ్డి…