Ravi Narain-Bhagavad Gita: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ, మాజీ ఎండీ రవి నరైన్‌తోపాటు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ కోర్టులో ఛార్జ్‌షీట్లు దాఖలుచేసింది. అనంతరం ఈ ముగ్గురి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 21వ తేదీకి పొడిగించింది. ఇదిలా ఉండగా తనకు భగద్గీతతోపాటు మరో పుస్తకాన్ని, కళ్లజోడును అందించాలని రవి నరైన్ న్యాయస్థానానికి విజ్జప్తి చేశారు.