‘కేజీఎఫ్’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ఆ తరువాత ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కించి తన సత్తా చాటాడు. అదే సమయంలో ‘రావణం’ అనే మరో యాక్షన్ మూవీని ప్రభాస్‌తో చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఇక ఆ కథ బన్నీ చేతుల్లోకి వెళ్లిందని ప్రచారం మొదలైంది. అంతేకాదు ప్రశాంత్ నీల్ కూడా సినిమా చేయడం లేదని వేరే దర్శకుడికి అప్పచెబుతున్నారు అని కూడా వార్తలు వచ్చాయి.…