Today (03-02-23) Business Headlines: హైదరాబాద్ కంపెనీ ‘ఆజాద్’ ఘనత: హైదరాబాద్ సంస్థ ఆజాద్ ఇంజనీరింగ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ మార్కెట్’కి న్యూక్లియర్ విడి భాగాలను అందించిన దేశంలోనే తొలి కంపెనీగా నిలిచింది. ఫ్రాన్స్’లో తయారుచేస్తున్న న్యూక్లియర్ టర్బైన్లకు కీలకమైన స్పేర్ పార్ట్స్ సప్లై చేసినట్లు ఆజాద్ ఇంజనీరింగ్ సంస్థ వెల్లడించింది. ఫ్రాన్స్ కంపెనీ GE స్టీమ్ పవర్’తో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందం వల్లే వరల్డ్ వైడ్’గా న్యూక్లియర్ సెక్టార్’లో బిజినెస్ ఆపర్చునిటీస్’ని దక్కించుకున్నామని తెలిపింది.