CM Chandrababu: మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రతన్ టాటా గొప్ప వ్యక్తి.. ఆయన సిoప్లీ సిటీ ఎంతో గొప్పది.. ఆయనతో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది.
రతన్ టాటా వారసత్వాన్ని ఏపీ నిరంతరం గుర్తు చేసుకుంటూనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతిలో 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్‌ను స్థాపించనున్నామని ఆయన తెలిపారు. రతన్ టాటాకు నివాళిగా ఆయన పేరుతో హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.