ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న రొమాన్స్ చేయనుండగా… క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.…