మేషం :- ఉద్యోగస్తులు శ్రమ, పనితనాన్ని అధికారులు గుర్తిస్తారు. పాత లక్ష్యాలు నెరవేరుతాయి. స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. ఇచ్చుపుచ్చుకునే విషయాల్లో ఖచ్చితంగా వ్యవహరించండి. ఆత్మీయుల కలయిక వల్ల మానసికంగా కుదుటపడతారు. రావలసిన ధనం చేతికందడంతో పొదుపు పథకాల వైపు దృష్టి మళ్లిస్తారు. వృషభం :- వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. పరిచయాలు సంతృప్తినిస్తాయి. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఖర్చులు అంచనాలు…