నటునిగా తనదైన బాణీ పలికించిన రంగనాథ్ ఎంతో సౌమ్యుడు. ఒకప్పుడు హీరోగా నటించి అలరించిన ఆయన కేరెక్టర్ యాక్టర్ గానూ రక్తి కట్టించారు. ఎందరిలోనో స్థైర్యం నింపిన రంగనాథ్ చివరకు ఆత్మహత్యతో అసువులు బాయడం అభిమానులను కలచి వేస్తూనే ఉంది. రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీరంగనాథ్. 1949 జూలై 17న రంగనాథ్ జన్మించారు. పేరుగా తగ్గట్టే సుందర రూపుడు. ఆరడగుల ఎత్తు. చూడగానే ఆకట్టుకొనే రూపం. చదువుకొనే రోజుల నుంచీ పలు అంశాలపై కవితలు…